జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన అకాల వర్షం కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మొక్క జొన్న కంకులు తడిసి పోయాయి.
జగిత్యాలలో భారీ వర్షం.. దెబ్బతిన్న పంటలు - జగిత్యాలలో భారీ వర్షం.. దెబ్బతిన్న పంటలు
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి రైతుల పంటలు నీళ్లపాలయ్యాయి.
జగిత్యాలలో భారీ వర్షం.. దెబ్బతిన్న పంటలు
ప్రధానంగా జగిత్యాల పట్టణంలో రోడ్లన్నీ జలమయ్యాయి. జిల్లాలో మల్యాల, పెగడపల్లి తదితర మండలాల్లో భారీగా వర్షం కురిసింది. తరుచూ కురుస్తున్న వర్షాలతో పంట నష్టం వాటిల్లుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: కాళేశ్వరంపై కౌంటర్‌కు సర్కారుకు రెండువారాల గడువు..