తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - HEAVY RAIN IN JAGITYAL TOWN... ROADS FILL WITH FULL OF WATER

జగిత్యాలలో సుదీర్ఘంగా కురిసిన వర్షంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. మరోవైపు రోడ్లపై భారీగా నీరు నిలవటంతో స్థానికులు కాస్త ఇబ్బందిపడ్డారు.

HEAVY RAIN IN JAGITYAL TOWN... ROADS FILL WITH FULL OF WATER

By

Published : Jun 30, 2019, 6:00 PM IST

జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు వర్షాలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతలకు వాన ఊరటనిచ్చింది. దాదాపు రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో టవర్ సర్కిల్ ప్రాంతంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవటం వల్ల ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. వీధుల్లో నీటి ప్రవాహం కాలువలను తలపించాయి. రహదారుల్లో నడవలేక పాదచారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

జగిత్యాలలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details