జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గంటన్నరకు పైగా కురిసిన వర్షానికి చిన్నచిన్నవాగులు పొంగి పొర్లాయి.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు - భారీ వర్షం
జగిత్యాల జిల్లావ్యాప్తంగా గంటన్నరకు పైగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లాయి. ఈ వర్షంతో రైతన్నల వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు
సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలో రహదారిపై నీరు ప్రవహించింది. నీటి ప్రవాహానికి రోడ్డు దెబ్బతింది. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారం, గొల్లపల్లి, మల్యాల, తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వర్షంతో వచ్చే పసుపురంగు కప్పలు శుభ సూచికమట...