జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం... అందులోనూ ఆదివారం సెలవుదినం కావటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఉసిరి చెట్టు ముందు కార్తీక దీపాలు వెలిగించారు.
కార్తీకమాస శోభ... ధర్మపురికి పోటెత్తిన భక్తులు... - DHARMAPURI TEMPLE UPDATES
కార్తీకమాసం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావటం వల్ల ధర్మపురికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
HEAVY CROWD TO DHARMAPURI TEMPLE