తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో నామమాత్రంగా లాక్​డౌన్​.. నిబంధనలు బేఖాతరు - తెలంగాణ గవర్నమెంట్ తాజా వార్తలు

ఓవైపు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న మందుబాబులు మాత్రం నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్​డౌన్​ నామమాత్రంగానే అమలవుతోంది. సడలింపు సమయంలో జనం రోడ్లపైకి కిక్కిరిసివస్తున్నారు.

 liquor stores
liquor stores

By

Published : May 18, 2021, 3:31 PM IST

ప్రభుత్వం కరోనా వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్​డౌన్​ విధించడంతో కొంతమంది పరిస్థితి విచిత్రంగా ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో లాక్​డౌన్​ నామమాత్రంగానే అమలవుతోంది. సడలింపు సమయంలో జనం రోడ్లపైకి కిక్కిరిసివస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వీధులన్నీ సందడిగా మారుతున్నాయి. 10 గంటలు దాటినా జనం తగ్గడం లేదు. శుభముహుర్తాలకు అనుకూలమైన రోజులు కావడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మందు అవసరం కావడం వల్ల ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాధి భయం అనేది లేకుండా పోయింది.

మంథని పట్టణంలో వైన్​షాపుల ముందు జనం ఎగబడుతున్నారు. ఉదయం 6 గంటలకే షాపులు తెరవాలని ప్రభుత్వం సూచించడంతో మందుబాబులు కూడా అదే సమయంలో వైన్​షాపుల వద్దకు వచ్చి 2,3కు మించి మందును కొనుగోలు చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలు సరిగా అమలు కావడం లేదు.

ఓవైపు దేశంలో కరోనాతో వేల మంది చనిపోతుంటే... మందుబాబులు మాత్రం ఏమైతదిలే అంటూ.. ఉదయం నుంచే మందుకోసం ఎగబడుతున్నారు. భౌతికదూరం కూడా పాటించడం లేదు. ప్రభుత్వం, ఎక్సైజ్​ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో నామమాత్రంగా లాక్​డౌన్​.. నిబంధనలు బేఖాతరు

ABOUT THE AUTHOR

...view details