Telangana Temperature: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనధ్‌లో 44.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 43.9, ఆదిలాబాద్ అర్బన్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!
Telangana Temperature: మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!
ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూస్‌లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
ఇవీ చదవండి: