తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్‌పల్లిలో హరితహారం కార్యక్రమం - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

మెట్‌పల్లిలో హరితహారం కార్యక్రమం
మెట్‌పల్లిలో హరితహారం కార్యక్రమం

By

Published : Jul 29, 2020, 12:51 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక కమిషనర్‌ జగదీశ్వర్ గౌడ్ కోరారు. మెట్‌పల్లి పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో మొక్కలను నాటి నీరు పోశారు.

అక్కడి ప్రజలకు మొక్కల పెంపకంపై జగదీశ్వర్‌ గౌడ్‌ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఏ చావైనా.. కొవిడ్​ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details