తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టులో నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాలు - హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో.. హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేడుకలను అంతర్గతంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. గతేడాది కూడా ఉత్సవాలను నిరాడంబరంగానే జరిపామన్నారు.

kondagattu usthavaalu
kondagattu usthavaalu

By

Published : Jun 1, 2021, 9:34 PM IST

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో.. హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణతో మొదలైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా భక్తులను అనుమతించకుండా ఉత్సవాలను అంతర్గతంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

బుధవారం వేకువజాము నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా గతేడాది కూడా ఉత్సవాలను నిరాడంబరంగానే జరిపామన్నారు. ఉత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యేవారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:ఐఐఎంలో సీటు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందించిన మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details