జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా భక్తులు ఎవరు లేకుండానే ప్రారంభయ్యాయి. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ దృష్ట్యా... ఈ ఏడాది ఉత్సవాలు మూడు రోజులపాటే జరగనున్నాయి.
Corona Effect: భక్తులెవరూ లేకుండానే హనుమాన్ జయంతి వేడుకలు
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఎవరూ లేకుండానే జరగనున్నాయి. కేవలం అతి కొద్దిమంది సమక్షంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇవాళ ప్రారంభ పూజలు జరిపారు.
భక్తులెవరూ లేకుండానే హనుమాన్ జయంతి వేడుకలు
స్వామి వారికి అభిషేకం నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలతో జయంతి వేడుకలను ప్రారంభించారు. లోక కల్యాణం కోసం హోమం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష