లాక్డౌన్ కారణంగా జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు లేకుండానే నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఏటా నిర్వహించే జయంతి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకునేవారు.. దీక్షాపరులు దీక్ష విరమణ చేసేవారు.. అయితే ఈ జయంతికి మాత్రం కరోన మహమ్మారి కారణంగా ఆలయం వెలవెలబోతోంది.. క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తుండగా.. అర్చకులు, అధికారులు మాత్రమే వేడుకల్లో పాల్గొన్నారు.
భక్తులు లేకుండానే కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు - జగిత్యాల జిల్లా
లాక్డౌన్ కారణంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులు లేకుండానే హనుమాన్ జయంతి వేడుకులను అధికారులు జరుపుతున్నారు. ఆలయంలో ప్రధాన అర్చకులు మాత్రమే ఉండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి ఎవరూ రాకుండా కొండపైకి చేరుకునే ప్రధాన రహదారిని భద్రతా సిబ్బంది మూసి వేశారు. కరోనా దృష్ట్యా ప్రజల శ్రేయస్సు కోరి.. భక్తులు లేకుండా అంజన్న జయంతిని జరుపడం ఇదే మొట్టమొదటి సారి అని ఆలయ ఏఈవో శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'