హనుమాన్ జయంతిని పురస్కరించుకుని.. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 41 రోజుల మండల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు.. వేద మంత్రాల నడుమ స్వాములకు మాలధారణ చేశారు.
ఘనంగా ప్రారంభమైన హనుమాన్ మండల దీక్షలు - హనుమాన్ చాలీసా
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని.. జగిత్యాల జిల్లాలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల దీక్షల్లో భాగంగా.. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వాములకు మాలధారణ చేశారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు.
ఘనంగా ప్రారంభమైన హనుమాన్ మండల దీక్షలు
పట్టణంలోని కాశీబాగ్ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు కోదండ రామాలయం, స్వయంభూ హనుమాన్ ఆలయం, అభయహస్త హనుమాన్ ఆలయాల్లో వేకువజాము నుంచే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా, దండకం పారాయణంతో.. ఆలయాలన్ని అంజన్న నామస్మరణతో మారుమోగిపోయాయి.
ఇదీ చదవండి:శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు