హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ యాగాన్ని నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే అర్చకులు విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు అనంతరం భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్ష నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించారు.
మెట్పల్లిలో ఘనంగా హనుమత్ యాగం - hanmanatha-yagam
మెట్పల్లిలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ యాగం ఘనంగా జరిగింది. భారీగా ఎత్తున భక్తులు హాజరై తమ మెుక్కులు చెల్లించుకున్నారు.
మెట్పల్లిలో ఘనంగా హనుమత్ యాగం