గురు పౌర్ణమి వేడుకలు జగిత్యాల జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని మెట్పల్లిలో శ్రీ మురళీకృష్ణ ఆలయంలో సుందర సత్సంగ్ వారి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున మురళీ కృష్ణునికి ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
మెట్పల్లిలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు - గురు పౌర్ణమి వేడుకలు తాజావార్తలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం వేకువజాము నుంచే అర్చకులు మురళీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుపూజ విశిష్టతను భక్తులకు వివరించారు.
మెట్పల్లిలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
అనంతరం స్వామి సుందర చైతన్యానంద విగ్రహానికి పూజ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురుపూజ విశిష్టతను భక్తులకు వివరించారు.