రాష్ట్రంలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కోరుట్లలో గల్ఫ్ కార్మికుల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేశారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ పాలసీ జెండా ఆవిష్కరించారు.
'గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించాలి' - జగిత్యాల జిల్లా వార్తలు
గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో గల్ఫ్ కార్మికుల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
!['గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించాలి' gulf-victims-need-employment-in-jagtial-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9593759-299-9593759-1605785375036.jpg)
'గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించాలి'
రాష్ట్రంలోని గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించాలని... గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జీడబ్లూసీ ఉద్యమ నేత కృష్ణ డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు.