జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన బాస శ్రీనివాస్ ఉపాధి కోసం షార్జా వెళ్లాడు. అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ రోదిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతేడాది జులై 19న శ్రీనివాస్‌ను ఓ ఏజెంట్ రూ. 75,000 తీసుకుని షార్జాలో ఓ కంపెనీలో పని ఉందంటూ పంపించాడని తెలిపారు. ఏజెంట్ చెప్పిన నిబంధనలు లేకపోగా కంపెనీ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని శ్రీనివాస్ అన్నాడు. వీడియో రాష్ట్ర సర్కారుకు చేరుకునేలా షేర్ చేయండి అంటూ శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇబ్బందిగా ఉందంటున్న గల్ఫ్ బాధితుని వైరల్ వీడియో - gulf victim of jagityal video goes viral
పొట్టకూటి కోసం దూరదేశానికి వెళ్తున్న ఎందరో అభాగ్యులు అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లా గోవిందారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ షార్జాలో ఇబ్బందులు పడుతున్నానంటూ రోదిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ఇబ్బందిగా ఉందంటున్న గల్ఫ్ బాధితుని వీడియో వైరల్
ఇబ్బందిగా ఉందంటున్న గల్ఫ్ బాధితుని వీడియో వైరల్
ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్ ఎక్కడిది?