మండపాల వద్ద గుజారాతీయుల దాండియా ఆటలు - danidiya
దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మండపాల వద్ద గుజరాతీల దాండియా అందరినీ ఆకట్టుకుంటోంది.
మండపాల వద్ద గుజారాతీయుల దాండియా ఆటలు
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని త్రిశక్తి ఆలయం వద్ద దుర్గమ్మ మండపం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద గుజరాతీల దాండియా ఆటలు భక్తులను అలరించాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఆడుతూ పాటలు పాడుతూ చూపరులను ఆకట్టుకున్నారు. దాండియాను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.