తెలంగాణ

telangana

ETV Bharat / state

మిద్దె తోటలో కూరల సాగు.. ఆరోగ్యం బహుబాగు.. - జగిత్యాలలో మిద్దెసాగు వార్తలు

మనం తినే కూరగాయాల్లో విపరీతమైన రసాయనాలను పిచికారి చేసి విక్రయిస్తున్నారు. అదీ కాకుండా ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఆహార పదార్థాలను బయట కొనుక్కోవాలంటే చాలా మంది భయపడుతున్నారు. నాణ్యమైన తాజా కూరగాయల పెంపకం కోసం ఇంటిపైనే మిద్దె తోట పెంపకం చేపట్టి.. అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన వర్షపై ఈటీవీ- ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

vegetables harvesting at home in jagityal district
మిద్దె తోటలో కూరల సాగు.. ఆరోగ్యం బహుబాగు..

By

Published : Sep 7, 2020, 8:25 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయిరాంనగర్​కు చెందిన రాచకొండ కుమారస్వామి- వర్ష దంపతులు... గతేడాది మిద్దె తోట పెంపకాన్ని ప్రారంభించారు. మేడపైనే బెండ, బీర, చిక్కుడు, సొరకాయ, టమాట, మిర్చితో పాటు పలు ఆకుకూరలను పెంచుతున్నారు. పనికి రాని టైర్లు, ఇతర డబ్బాలు ఉపయోగించి.. వాటిలో మట్టిని నింపి కూరగాయలు పండిస్తున్నారు. వీటితో పాటు పూలు, అంజీర పళ్లు, దానిమ్మ, నల్లేరు వంటినీ పెంచుతున్నారు. కరోనా సమయంలో ఇంట్లోనే మొక్కల్ని పెంచుతూ.. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఓ పక్క మార్కెట్​లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం.. మరోవైపు వాటిపైనే రసాయనాలను చల్లడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని.. ఇలా సేంద్రీయంగా పండించిన కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నామని వర్ష దంపతులు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట నుంచి కూరగాయలు తెచ్చుకోకుండా.. మిద్దె తోట పెంపకంలోని కూరలనే ఉపయోగించామని వర్ష చెప్పారు. పట్టణాల్లో ఉండే గృహిణులకు ఈ పద్ధతి అనుసరించేందుకు వర్ష మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details