జనగామలో 200 మంది ప్రైవేట్ టీచర్లకు నర్మెట్ట పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడి పుట్టినరోజున ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ - పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసరాల పంపిణీ
కొవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు జగిత్యాల జిల్లా నర్మెట్ట పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఎవరూ ధైర్యం కోల్పోవద్దని టీచర్ల తెలిపారు.
Breaking News
ఈ సందర్భంగా గురువులను మించిన దైవం లేదని, కరోనా కష్ట సమయంలో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు చూడలేక తన వంతుగా చిన్న సహకారం అందించానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగించాయని, ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కోరారు. అంతకు ముందు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేశారు.
ఇదీ చూడండి:ఆన్లైన్ ద్వారా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే