ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో త్రిదండి చిన జీయర్ స్వామి, ఉత్తర భారతానికి చెందిన సంపూర్ణనంద స్వామి పాల్గొని భక్తులకు మార్గదర్శనం చేశారు. రెండు గంటల పాటు ఈ హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.
భక్తిపారవశ్యం... గోదారమ్మకు మహా హారతి ఉత్సవం - ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవంగా సాగిన గోదావరి హారతి
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ వేడుకలో త్రిదండి చిన జీయర్ స్వామి, ఉత్తర భారతానికి చెందిన సంపూర్ణనంద స్వామి పాల్గొన్నారు.
![భక్తిపారవశ్యం... గోదారమ్మకు మహా హారతి ఉత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5166518-839-5166518-1574651586396.jpg)
ఘనంగా సాగిన గోదావరి హారతి కార్యక్రమం
Last Updated : Nov 25, 2019, 10:06 AM IST