తెలంగాణ

telangana

ETV Bharat / state

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం - జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.

godadevi kalyanam
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం

By

Published : Jan 10, 2020, 2:39 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకొని గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి చెన్నకేశవ స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.

స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకి సేవలో ఊరేగించారు. అనంతరం కల్యాణ మండపంలో గోదా కల్యాణాన్ని కున్నుల పండువగా చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం

ఇవీ చూడండి: మున్సిపాలిటీల్లో 'హస్త'వాసి పనిచేసేనా..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details