'గెలిచిన సంతోషంలో ఉంటే కేసులు పెడతారా?' - celebrations
విజయోత్సాహంలో సంబురాలు చేసుకుంటే..పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. ఖాకీల తీరుపై జగికత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఎన్నికల ఫలితాల రోజు రాత్రి భాజపా నాయకులు డీజే పెట్టుకుని నృత్యాలు చేస్తున్నారు. ఈ సమయంలో మల్లాపూర్ ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ వచ్చి అకారణంగా దుర్భాషలాడుతూ... యువకుల కాలర్ పట్టుకున్నారు. ఆగ్రహంచిన గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగిందని... దీనికి కారణం పలువురు యువకులంటూ 9 మందిపై కేసులు నమోదు చేశారని నిరసన వ్యక్తం చేశారు. రాఘవపేటలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన జరిపారు. కేసులను కొట్టివేసి గొడవకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చివరకు సీఐ వచ్చి వారికి నచ్చ జెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వారిచే ఆందోళన విరమింపజేశారు.