ప్రభుత్వాన్ని నమ్ముకుని వచ్చిన అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో అకాల వర్షాలు రైతన్నలకు కొంప ముంచుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కురిసిన అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసి పోయింది. లారీల కొరత, తేమ శాతం, తాలు, ఇలా వివిధ కారణాల పేరట కొనుగోలు జాప్యం చేయడంతో మార్కెట్ యార్డులు రైతులు ధాన్యం పేరుకుపోతుంది.
తడిసిన ధాన్యం రాశులు.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు - వర్షాలకు తడిసిన ధాన్యం
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కురిసిన అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసి పోయింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని వస్తే... నెల రోజులు గడుస్తున్నా పట్టించుకునే అధికారులే లేరంటూ అన్నదాతలు వాపోతున్నారు.
తెల్లవారుజామున కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మూడు వేల క్వింటాళ్ల పైన ఉన్న ధాన్యం యార్డులో ఉండగా.. ఇందులో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని.. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని వస్తే నెల రోజులు గడుస్తున్నా పట్టించుకునే అధికారులే లేరంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజు ధాన్యం కుప్పలు వద్ద పడిగాపులుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత ఆరు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో… వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Corona Death: ఒకరి తర్వాత ఒకరు.. ఒకేరోజు ముగ్గురు మృతి