రైతులు ఆందోళన చెందనవసరం లేదని.. ప్రతి రైతుకు చెందిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులకు భరోస ఇచ్చారు. జగిత్యాల జిల్లా గుట్రాజ్‌పల్లి, అనంతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'ప్రతి ధాన్యం గింజని కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు'
రైతులు ఎవరూ ఆందోళన పడొద్దని.. పండించిన ప్రతి గింజను విక్రయించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా కల్పించారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
'ప్రతి ధాన్యం గింజని కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు'
ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. త్వరలోనే కొనుగోళ్లు పూర్తి చేస్తామని మంత్రి రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?