జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. వేడుకలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారి కల్యాణ తంతును నిర్వహించారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
మెట్పల్లిలో వైభవంగా గోదారంగనాథుల కల్యాణం - మెట్పల్లిలో గోదారంగనాథుల కల్యాణం
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదారంగనాథుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.
గోదా రంగనాథుల కల్యాణం, మెట్పల్లి
కల్యాణ వేడుకను తిలకించడానికి మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:ఐనవోలులో అంగరంగ వైభవంగా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు