తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురిలో వైభవోపేతంగా గోదారమ్మకు మహా హారతి - గోదావరికి మహాహారతి కార్యక్రమం

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పునరుజ్జీవనం కోసమే దశాబ్ద కాలంగా ప్రతి ఏటా గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాజపా జాతీయ నాయకుడు మురళీధర్​రావు తెలిపారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో వైభవోపేతంగా ఆలయ అర్చకులు.. గోదారమ్మకు హారతినిచ్చారు.

godavari mahaharthi in dharmapuri jagtial district
'ప్రతి మండలంలో గోశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు'

By

Published : Dec 15, 2020, 9:39 AM IST

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పునరుజ్జీవనం కోసమే దశాబ్ద కాలంగా ప్రతి ఏటా గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భాజపా జాతీయ నాయకుడు, మురళీధర్ రావు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదారమ్మకు వైభవోపేతంగా ఆలయ అర్చకులు హారతినిచ్చారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి మెరుగైన పంటలు పండించేందుకు సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ప్రతి మండలంలో గోశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మురళీధర్​ రావు తెలిపారు. పచ్చదనం కోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి:6నెలల్లో 50వేల ఉద్యోగాలు.. ఖాళీల భర్తీకి సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details