జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం ఉదయం వరకు ఎడారిని తలపించిన గోదావరి... ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో గలగల పారుతోంది. అటవీ ప్రాంతాల్లోని వాగుల ద్వారా భారీగా వరద నీరు చేరటం వల్ల నదీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మపురిలో గలగలా పారుతున్న గోదావరి - jagitial
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వరద నీటితో కళకళలాడుతోంది.
ధర్మపురిలో గలగలా పారుతున్న గోదావరి