జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో గోదా రంగనాయకుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.. ఉత్సవ మూర్తులను ప్రాకార మండపంలో ప్రత్యేక వేదికపై ఉంచి స్వామివారులను అలంకరించి కల్యాణ తంతు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
కొండగట్టులో వైభవంగా గోదారంగనాయకుల కల్యాణం - telangana varthalu
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో గోదాదేవి, రంగనాయక స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కొండగట్టు క్షేత్రంలో వైభవంగా గోదారంగనాయకుల కల్యాణం
అంతకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమం జరగగా స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు హాజరై పూజలు నిర్వహించారు.. ఆలయ ఈవో చంద్రశేఖర్, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఐనవోలులో అంగరంగ వైభవంగా ఉత్సవాలు.. పోటెత్తిన భక్తులు