తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి, నీటమునిగిన పంట పొలాలు - నీటమునిగిన పంట పొలాలు

go-to-srsp-canal-submerged-crop-fields
ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి, నీటమునిగిన పంట పొలాలు

By

Published : Aug 17, 2020, 9:51 AM IST

Updated : Aug 17, 2020, 10:55 AM IST

07:27 August 17

ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి, నీటమునిగిన పంట పొలాలు

జగిత్యాల జిల్లా ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి పడి పంట పొలాలు నీటమునిగిపోయాయి. నామాపూర్‌, తిమ్మాపూర్‌ వద్ద ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి పడటం వల్ల బతికేపల్లి, ఆరవెల్లి, మోటపల్లి మధ్య వంతెనపై నుంచి నీరు ప్రవహించింది. జగదేవ్‌పేటలో జంగల్‌నాలా ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. రాయపట్నం వద్ద ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ భారీగా నిలిచింది. 

కుండపోత వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు, చెరువులు అలుగు పారుతున్నాయి. పలు చోట్ల రోడ్లపైనా వరద ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ తరుణంలో జగిత్యాల జిల్లాలో ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వకు గండి పడి పంట పొలాలు కనపడకుండా వరద చేరింది.

ఇదీ చూడండి :వరుణాగ్రహం: 60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

Last Updated : Aug 17, 2020, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details