జగిత్యాల పట్టణంలోని అష్టలక్ష్మి దేవాలయంలో మహిళలు దీపోత్సవం నిర్వహించారు. కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని మోతె చెరువులో దీపాలు వదిలారు.
జగిత్యాలలో కన్నులపండువగా దీపోత్సవం - dasara celebrations in jagityala
జగిత్యాల అష్టలక్ష్మీ ఆలయంలో ఆదివారం కన్నుల పండువగా దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జగిత్యాలలో కన్నులపండువగా దీపోత్సవం
అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. లలిత సహస్రనామ పారాయణం, భజనలతో అమ్మవారిని ప్రార్థించారు. లోక కల్యాణం కోసం ఏటా శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: రైతు సంక్షేమానికి కేంద్రం అడ్డుపడుతోంది: ఎమ్మెల్యే సుంకె