జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగపుత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని... ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
'మంత్రి తలసాని వెంటనే రాజీనామా చేయాలి' - మంత్రి తలసాని వార్తలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాలని గంగపుత్రులు ఆందోళనకు దిగారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెట్పల్లిలో భారీ ర్యాలీగా వెళ్లి... ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'మంత్రి తలసాని వెంటనే రాజీనామా చేయాలి'
మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల నుంచి వచ్చిన గంగపుత్రులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడినుంచి భారీ ర్యాలీగా వెళ్లి... పాత బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని... గంగపుత్రులకు క్షమాపణ చెప్పాలన్నారు. స్పందించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.