జగిత్యాలలో వినాయక శోభాయాత్ర వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుణ్ని నృత్యాలు, కోలాటాలతో భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. చివరిసారిగా విఘ్నేశ్వరుణ్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగిత్యాల టవర్ సర్కిల్ భక్తుల రద్దీతో కోలాహలంగా మారింది. బ్యాండు, డప్పు చప్పుళ్లతో పట్టణ వీధులన్నీ మార్మోగాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సింధూశర్మ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జగిత్యాలలో వైభవంగా వినాయక శోభాయాత్ర - నృత్యాలు, కోలాటాలు
జగిత్యాల జిల్లాలో వినాయక శోభాయాత్ర ఘనంగా సాగింది. భక్తుల నృత్యాలు, కోలాటాలతో గణేశున్ని సాగనంపారు.
జగిత్యాలలో వైభవంగా వినాయక శోభాయాత్ర
ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత