తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాలలో నిరాడంబరంగా నవరాత్రి ఉత్సవాలు!

జగిత్యాల జిల్లావ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి ఏడాదిలా కాకుండా.. ఈ ఏడాది నిరాడంబరంగా.. చిన్న చిన్న విగ్రహాలతో ఉత్సవాలు జరుపుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే గణపతి విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు.

Ganesh Chaturthi Celebrations In Jagitial
జగిత్యాలలో నిరాడంబరంగా నవరాత్రి ఉత్సవాలు!

By

Published : Aug 22, 2020, 3:43 PM IST

జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు నిరాడంబరంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది వినాయక చవితి అంటేనే అంగరంగ వైభవంగా సంబరాలు చేసేవారు. కానీ.. ఈ ఏడాది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండుగ జరుపుతున్నారు. చిన్న చిన్న విగ్రహాలు ఇంట్లోనే ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. పూజాసామాగ్రి, పూలు, పండ్లు కొనడానికి వచ్చిన భక్తులతో మార్కెట్లలో సందడి నెలకొంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణపతి ఆలయంలో చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details