జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన కందుకూరి విజయ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త వద్దకు ఈ మధ్యనే వెళ్లిన ఆమె రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో మృతి.. ఆన్లైన్లో అంత్యక్రియలు
అమెరికాలో భర్త వద్దకు వెళ్లిన ఆ మహిళను విధి చిన్నచూపు చూసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని చిదిమేసింది. కుటుంబ సభ్యుల కడసారి చూపు కోసం మృతదేహాన్ని భారత్కు తీసుకురావాలని అనుకున్నారు. కానీ పాస్పోర్ట్ ఎక్కడో పడిపోవడంతో.. అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. ఆ తల్లి కడసారి చూపు దక్కక వారి పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.
కడసారి చూపు ఆన్లైన్లోనే
ఆమె పాస్పోర్ట్ ఎక్కడో పడిపోవటంతో మృతదేహాన్ని భారత్కు తీసుకురాలేకపోయారు. దీంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహించారు. మల్యాలలో ఉన్న ఆమె ఇద్దరు కుమారులు, బంధువులు చివరి చూపును ఫోన్లో చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి: భర్త జ్ఞాపకాలే ఊపిరిగా... సమాధి వద్దే పెళ్లిరోజు వేడుకలు