తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండగట్టుకు పోటెత్తిన భక్త జనం - కొండగట్టుకు పోటెత్తిన భక్త జనం

మేడారం జాతర సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ అంజన్నను దర్శించుకొని... అనంతరం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వెళ్తున్నారు.

kondagattu
కొండగట్టుకు పోటెత్తిన భక్త జనం

By

Published : Jan 21, 2020, 12:06 PM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు భక్త జన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత భక్తులు ఆలయానికి తరలి రావటం వల్ల ఆలయం కిటకిటలాడుతోంది. మేడారం జాతరకు ముందు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు చాలా మంది భక్తులు.

ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రావటం వల్ల క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. జనసందోహం పెరగటం వల్ల ఆలయం బయట ట్రాఫిక్ స్తంభించిపోయింది.

కొండగట్టుకు పోటెత్తిన భక్త జనం

ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ABOUT THE AUTHOR

...view details