Fancy Number Plates: ఫ్యాన్సీ నంబర్లపై మోజు రోజురోజుకు పెరుగుతోంది. వాహనం నంబరు ప్లేటుపై అంకెలన్నీ ఒకేలా ఉండాలని ఎంతోమంది అనుకుంటారు. అదీ 9 నంబరు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు. బుధవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించగా టీఎస్ 09 ఎఫ్‌యూ 9999ను గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ.10,49,999కు దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌వీ 0009 నంబరు రూ.3,50,005 పలికింది. ఆరు నెంబర్లకు రూ.లక్షకుపైనే. వేలం ద్వారా మొత్తం రూ.30,83,986 సమకూరినట్లు రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు.
నంబర్లు | ధర | దక్కించుకున్న సంస్థ |
టీఎస్ 09 ఎఫ్‌వీ 9999 | 10,49,999 | గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ |
టీఎస్ 09 ఎఫ్‌వీ 0009 | 3,50,005 | సీహెచ్ అనంతయ్య |
టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 | 3,50,000 | రాజోర్ గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ |
టీఎస్ 09 ఎఫ్‌వీ 0005 | 2,20,000 | కెమిస్ట్రీ ఫార్మా కన్సల్టెన్సీ |
టీఎస్ 09 ఎఫ్‌వీ 0007 | 1,15,000 | జుకా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ |
టీఎస్ 09 ఎఫ్‌వీ 0006 | 1,10,111 | పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ |