జగిత్యాల జిల్లా గుట్రాజ్‌పల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటించారు. గుట్రాజ్‌పల్లి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.
గుట్రాజ్‌పల్లిలో చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన - jagtial mla sanjay kumar
వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలు ఉపయోగపడతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం గుట్రాజ్‌పల్లి వాగుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
![గుట్రాజ్‌పల్లిలో చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన jagtial district news, jagtial mla sanjay kumar, check dam in jagtial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:42:55:1620025975-tg-krn-21-03-check-dam-mla-pooja-avb-ts10035-0305digital-1620025466-533.jpg)
జగిత్యాల జిల్లా వార్తలు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాలలో చెక్ డ్యాం
వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. వీటిద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ సర్కార్ తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.
- ఇదీ చదవండిదేవరయాంజల్ ఆలయ భూకబ్జాలపై విచారణకు కమిటీ