ఈ నెల 9న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు సదస్సుకు పెద్ద ఎత్తున అన్నదాతల కుటుంబాలు తరలిరావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లాలో రైతు నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మూరు సదస్సును విజయవంతం చేసేందుకు కర్షకులందరూ తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి అన్నదాతల సత్తా చాటాలని సూచించారు.
'ఏప్రిల్ 9న ఆర్మూరు రైతు సదస్సుతో సత్తా చాటాలి' - ఏప్రిల్ 9 ఆర్మూరు రైతు సదస్సు
ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు మాత్రం తీరడంలేదని అన్నదాతలు ఆర్మూరు వేదికగా రైతు సదస్సుకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్ర జొన్నలకు మద్దతు ధర విషయమై రైతుల ఆందోళన ఉద్యమ రూపం దాల్చనుంది.
ఏప్రిల్ 9 ఆర్మూరు రైతు సదస్సు