తన భూమిని అధికారులు మరొకరికి పట్టా చేశారని.. న్యాయం చేయాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణి ముందు ఓ రైతు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. 50 ఏళ్లుగా ఉన్న తన ఆస్తిని మరొకరి పేరుపై మార్చారని.. దానిపై రైతు బంధు కూడా పొందారని మల్యాల మండలం రామన్నపేటకు చెందిన బండారి ఆనంద్‌రావు ఆరోపించారు. దీనికి ఆర్‌ఐ, ఆర్డీవోనే బాధ్యులని.. న్యాయ విచారణ చేసి తన భూమిని ఇప్పించాలని రైతు కోరారు.
ప్రజావాణి ముందు రైతు ఆత్మహత్యాయత్నం - 50 ఏళ్లు
50 ఏళ్లుగా ఉన్న తన భూమిని మరోకరిపై పట్టా చేశారని రైతు బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. జగిత్యాల ప్రజావాణి ముందు ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు.

జిల్లా కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం