తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ వర్షాలకు వరద కాల్వకు కోత... పొంచి ఉన్న ముప్పు - మల్యాల మండలం నూకపల్లి వద్ద వరద కాల్వకు ఆపద

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్‌-జగిత్యాల రహదారి పక్కనే ఉన్న వరద కాల్వ కోసుకుపోతోంది. ఫలితంగా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి కాల్వలోకి చేరుతున్న క్రమంలో కాల్వ ఒడ్డు మొత్తం కోసుకుపోయింది. ఎప్పుడు కట్ట తెగిపోతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలకు వరద కాల్వకు కోత... పొంచి ఉన్న ముప్పు
భారీ వర్షాలకు వరద కాల్వకు కోత... పొంచి ఉన్న ముప్పు

By

Published : Sep 15, 2020, 10:49 AM IST

జగిత్యాల జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్‌-జగిత్యాల రహదారిని ఆనుకుని ఉన్న వరద కాల్వ కోతకు గురైంది. మల్యాల మండలం నూకపల్లి వద్ద సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

మరింత వరద ప్రవాహంతో..

ఫలితంగా మరింత వరద నీరు వచ్చి కాల్వలోకి చేరుతోంది. ఈ క్రమంలో కాల్వ ఒడ్డు మొత్తం కోసుకుపోయింది. ప్రమాదవశాత్తు ఒడ్డు తెగిపోతే లోతట్టు ప్రాంతాలకు, పంట పొలాలకు ముప్పు పొంచి ఉందని రైతులు భయాందోళన వ్యక్తం చేశారు.

'ఇకనైనా మేల్కొనండి అధికారులూ ' ..

అధికారులు వెంటనే స్పందించి వరద కాల్వకు మరమ్మతులు చేయించాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇవీ చూడండి : 'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

ABOUT THE AUTHOR

...view details