జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఆదివారం కొత్తగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 64 కేసులు నమోదయ్యాయి.
జగిత్యాల జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు - five corona cases in jagtial district
జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఐదు పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా ధర్మపురి మండలంలో గృహిణికి కరోనా సోకగా.. ఎలా సోకిందో తెలుసుకునేందుకు వైద్యులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం, బుగ్గారం, గొల్లపల్లి, మేడిపల్లి మండలాల్లో ఒక్కొక్కరి చొప్పున వ్యాధి సోకింది. ధర్మపురి మండలంలోని మహిళ మినహా మిగతా నలుగురు ముంబయి నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరందర్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ తెలిపారు.
- ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా