జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రం అందించారు. మత్స్యకారులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా ..ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల విక్రయాల కోసం వాహనాలకు డీడీలు కట్టి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ రాలేదన్నారు. అప్పులు చేసి వాహనాలకు డబ్బులు కట్టామని వాపోయారు.
డీడీలు కట్టినా.. వాహనాలు రాలేదు - వాహనాలు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గంగపుత్రులు ఆందోళన బాట పట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. చేపల విక్రయాల కోసం వాహనాలకు డీడీలు కట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ వాహనాలు రాలేదన్నారు.

నినాదాలు చేస్తున్న మత్స్యకారులు
Last Updated : Sep 9, 2019, 3:34 PM IST