ఈ మధ్యకురిసిన వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలోనే చేపల వేటకు వెళ్లిన జింక ఆంజనేయులు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద నీటి ప్రవాహం పెరిగి కొట్టుకుపోయాడు. నీటిలో కోట్టుకుపోతున్న దృశ్యాన్ని చూసిన గంగారాం గంగపుత్ర అనే మరో మత్స్యకారుడు తెప్పసాయంతో వెళ్లి కాపాడాడు.
గల్లంతైన మత్స్యకారుడిని కాపాడిన మరో మత్స్యకారుడు - మత్స్యకారుడి గల్లంతు వార్తలు జగిత్యాల జిల్లా
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద పెరిగిన గోదావరి నీటి ప్రవాహంలో ఓ మత్స్యకారుడు కొట్టుకుపోయాడు. అతను కొట్టుకుపోతున్న దృశ్యాన్ని చూసిన మరో మత్స్యకారుడు తెప్పసాయంతో వెళ్లి కాపాడాడు. ఇది తెలిసిన పోలీసులు కాపాడిన మత్స్యకారుడిని అభినందించారు.
గల్లంతైన మత్స్యకారుడిని కాపాడిన మరో మత్స్యకారుడు
నిర్మల్ జిల్లా బెల్లాల వద్ద అతన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చాడు. క్షేమంగా ఒడ్డుకు చేర్చిన మత్స్యకారుడికి జగిత్యాల రూరల్ సీఐ రాజేశ్, ఎస్సై ఆరోగ్యం.. నగదు సాయం అందించి అభినందించారు. నీటి ప్రవాహం పెరగడం వల్లే గల్లంతైనట్లు బాధితుడు తెలిపాడు.
ఇదీ చదవండి:రామడుగు ప్రాజెక్టులో యువకుడు గల్లంతు..
Last Updated : Oct 5, 2020, 1:22 AM IST