జగిత్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు తొలి రోజు పరీక్ష రాసేందుకు ఉదయం ఏడున్నర గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.... 18 వేల 207 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
జగిత్యాల జిల్లాలో తొలిరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 7, 179 మంది ఈ రోజు పరీక్షను రాశారు. ఇందుకోసం 589 మంది ఇన్విజిటేర్లు, మూడు సిట్టింగ్ స్కాడ్లు, రెండు ప్లాయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి జిల్లాలో ప్రశాంతంగా తొలి రోజు ఇంటర్ పరీక్ష పూర్తయింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'