తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్ని ప్రమాదాలపై ప్రదర్శనలు - FIRE

అసలే వేసవికాలం... ఎప్పుడు ఎక్కడి నుంచి మంటలు వస్తాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో అగ్నిమాపక అధికారులు... ఆర్టీసీ డిపో కార్మికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాలపై ప్రదర్శనలు

By

Published : Mar 15, 2019, 1:24 PM IST

అగ్ని ప్రమాదాలపై ప్రదర్శనలు
ప్రస్తుత వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్ కేంద్రంలోని పలు చోట్ల అగ్ని ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో కార్మికులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై ప్రదర్శన చేశారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో సహా అవి సంభవించినప్పుడు ఏవిధంగా ఎదుర్కోవాలి అనే అంశాలను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details