నియంత్రిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిష్టాత్మంగా నిర్మించిన కాళేశ్వరం నీటిని చివరి ఆయకట్టుకూ అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. కాలువ పూడికతీత కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, నేతలు సహకరించాలని మంత్రి కోరారు.
చివరి భూమి వరకూ నీరందాలి : మంత్రి ఈశ్వర్