తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా - farmers protest to buy grains at jagityal

జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటంతా తడిసిపోయింది. జూన్​ 11 వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని... తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాయికల్​లో రైతులు ధర్నాకు దిగారు.

farmers protest to buy grains at jagityal
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా

By

Published : Jun 11, 2020, 2:19 PM IST

జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యమంతా తడిసిపోయింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ రాయికల్​లో రైతులు ధర్నాకు దిగారు. జగిత్యాల-రాయికల్​ రహదారిపై రైతులు అరగంటకు పైగా ఆందోళన చేపట్టారు.

జూన్ 11 తేదీ వచ్చినా ఇంకా ధాన్యం కొనలేదని.. రైతులను పట్టించుకోవట్లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు ఘటనాస్థలానికి వచ్చి హామీ ఇవ్వడం వల్ల వారు ఆందోళనను విరమించారు.

ఇవీ చూడండి:గంటల పాటు ఎండ ఉన్నా.. వైరస్‌ విజృంభణ!

ABOUT THE AUTHOR

...view details