జగిత్యాల జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు త్వరగా చేపట్టాలని గొల్లపల్లి రహదారి జాబితాపూర్‌లో రైతులు ఆందోళన నిర్వహించారు. మిల్లర్లు బస్తాకు మూడు కిలోల చొప్పున కోత విధిస్తున్నారని నిరసిస్తూ ధర్నా చేశారు. నాణ్యత పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం నాణ్యతగా ఉన్నా మిల్లర్లు తీసుకోవట్లేదని వాపోయారు. మిల్లర్ల మోసాన్ని అరికట్టి తమకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
జగిత్యాల జాబితాపూర్ రహదారిపై రైతుల ధర్నా - రైతుల ధర్నా
జగిత్యాల జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు బస్తాకు 3 కేజీల చొప్పున కోత విధిస్తున్నారని నిరసిస్తూ ధర్నా చేపట్టారు.
వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి : రైతులు