జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు రైతువేదికను జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. పంటల సాగులో మేలైన, శాస్త్రీయ పద్ధతులు అనుసరించేందుకు రైతువేదికను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు స్వీకరించి పంట పెట్టుబడులు తగ్గించుకుని అధిక దిగుబడి సాధించాలన్నారు.
'సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు' - తెలంగాణ వార్తలు
సాగులో మేలైన, శాస్త్రీయ పద్ధతులు అనుసరించేందుకు రైతువేదికను ఉపయోగించుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా పూడూరులో రైతువేదికను జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆయన ప్రారంభించారు.
'సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు'
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,300 కోట్లతో 25వేల లోపు రైతులకు రుణమాఫీ చేశారని వెల్లడించారు. సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రవిశంకర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్