జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, రాయికల్ మండలంలోని తాట్లవాయి, దావనపల్లి, వస్తాపూర్, ధర్మాజీపేట గ్రామాల్లో కురిసిన అకాల వర్షం కారణంగా ధాన్యం తడిచిపోయింది ఒక్కసారిగా గాలివానతో వాన పడటం వల్ల ధాన్యం నీటి ప్రవాహానికి కొట్టకుపోయింది.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం కురిసింది. వర్షానికి ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. తమకు తీరని నష్టం జరిగిందని అన్నదాతలు వాపోతున్నారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
ధాన్యం కుప్పలు తడిచిపోవటం వల్ల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ కారణంగా కొనుగోళ్లు ఆలస్యమవుతోన్న తరుణంలో వర్షం కారణంగా మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. భారీగా వీచిన గాలులతో కోతకు వచ్చిన మామిడి కాయలు సైతం రాలిపోయాయి. తమకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.