తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2020, 5:02 PM IST

ETV Bharat / state

'పసుపుకు మద్దతు ధర ఇవ్వండి'

జగిత్యాల జిల్లా మెట్​పల్లి వ్యవసాయ మార్కెట్​ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పసుపుకు మద్దతు ధర ప్రకటించాలంటూ నిజామాబాద్,​ జగిత్యాల జిల్లాల నుంచి వచ్చిన రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

Farmers dharna to give minimum retail price for turmeric crop in jagityala
'పసుపుకు మద్దతు ధర ఇవ్వండి'

పసుపు పంటకు రూ. 15వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చిన రైతులు కలిసి జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

మద్దతు ధర ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించుకు కూర్చోవడం వల్ల పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.

'పసుపుకు మద్దతు ధర ఇవ్వండి'

ఇవీ చూడండి:కరోనా @110: భారత్​ను కలవరపెడుతోన్న కొవిడ్​-19 కేసులు

ABOUT THE AUTHOR

...view details